Nine Dash Line Islands : 

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం విరమణకు  ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే చైనా సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు దేశంలో కరోనా కేసులు తామరతంపరగా పెరుగుతుంటే వాటిని కట్టడి చేయాల్సింది పోయి దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు ఏర్పాటు చేసి మిలిటరీ అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్‌ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రంలో కొన్ని రోజులుగా చైనా ఆర్మీ డ్రిల్స్‌ చేస్తోంది. తైవాన్‌ గగనతలంలోకి వారం రోజులుగా యుద్ధ విమానాలు పంపుతున్న చైనా.. తైవాన్‌కు 180కిలోమీటర్ల దూరంలోని దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు నిర్వహించి తైవాన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాంతంలో చైనా కృత్రిమ దీవులను ఏర్పాటు చేయటం ఉద్రిక్తతలను పెంచుతోంది. నైన్ డాష్ లైన్ పేరుతో ఏర్పాటు చేసిన దీవుల్లో చైనా భారీగా మిలిటరీని మోహరించింది.

దీంతో యుద్ధానికి సిద్ధం అనే రేంజ్‌లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచుతోంది. ఎప్పుడు ఏ క్షణంలోనైనా తైవాన్‌పై చైనా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులుగా చైనా ఆర్మీ ఫ్యూజియాన్‌ రీజియన్‌లో డ్రిల్స్‌ నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతోంది. తైవాన్‌ నుంచి ఫ్యూజియాన్‌ సముద్రపు సరిహద్దుకు కేవలం 180కిలోమీటర్లే దూరం. డ్రాగన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కొంటామని తెలిపింది తైవాన్. పునరేకీకరణ కోసం ఆ దేశం తీసుకొస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేసింది. తైవాన్‌ ప్రజల సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా చైనా చర్యలున్నాయని ఫైర్‌ అయ్యింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌  సామ్రాజ్యవాద ధోరణితో సరిహద్దు దేశాలాతో వివాదాలు ముదురుతున్నాయి.

Also Read : చైనా నగరాల్లో మళ్ళీ లాక్ డౌన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *