Thursday, March 28, 2024
Homeసినిమామ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీకి ముహుర్తం ఫిక్స్.

మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీకి ముహుర్తం ఫిక్స్.

Title Soon: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల ‘స‌ర్కారు వారి పాట’తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించ‌డం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవ‌ర్ సీస్ లోనూ రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు. దీనికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందించ‌నున్నారు.

అయితే.. ఇక ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు స‌మాచారం. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్‌ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో మహేష్ కి జంట‌గా పూజ హెగ్డే   నటిస్తోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ ను జులైలో నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. ఈసారి ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్