Mahi Gill :ప్రముఖ హిందీ హీరోయిన్ మహి గిల్ ఈ రోజు బిజెపిలో చేరారు. చండీగడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బిజెపి పంజాబ్ ఎన్నికల ఇంచార్జ్ గజేంద్ర సింగ్ షెఖావత్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, పార్టీ జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ల సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పంజాబ్ మహిళలకు సేవ చేసేందుకే తానూ బిజెపిలో చేరుతున్నట్టు మహి గిల్ ప్రకటించారు. దేవ్ డి సినిమాతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహి గిల్ గతంలో సాహెబ్ బివి ఔర్ గులాం, పాన్ సింగ్ తోమార్, గులాల్ తదితర సినిమాల్లో నటించారు. 46 ఏళ్ల గిల్ 2003లో ‘హవా’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దీని తరువాత, ఆమె ‘ఖుషీ మిల్ గయీ’,’సిర్ఫ్ పంచ్ దిన్’ వంటి పంజాబీ చిత్రాలకు కూడా నటించారు. వెండి తెరపై ఆకట్టుకున్న ఆమె తాజాగా రాజకీయాల్లో రాణించేందుకు పొలిటికల్ ఏంట్రీ ఇచ్చారు.
ఇదే కార్యక్రమంలో మరో పంజాబీ నటుడు కమల్ ధలివాల్ కమల తీర్థం పుచ్చుకున్నారు. బిజేపితోనే అభివృద్ధి సాధ్యమని, పంజాబ్ లో గెలుపుకు కృషి చేస్తానని ధలివాల్ అన్నారు. పంజాబ్ లో గెలుపు కోసం ఉన్న అవకాశాల్ని బిజెపి వదలకుండా వినియోగించుకుంటోంది. సాగు చట్టాలతో పంజాబ్ రైతాంగంలో బిజెపి వ్యతిరేకత తగ్గించేందుకు సిని గ్లామర్ ను తెర మీదకు తీసుకువచ్చేందుకు మహి గిల్, కమల్ ధల్లివాల్ తో ఇప్పటికే పార్టీలో ఉన్న బాలివుడ్ తారల్ని కొద్ది రోజుల్లో ప్రచారానికి తీసుకు వచ్చేందుకు ప్రణాలికలు సిద్దం చేశారు.
Also Read : పంజాబ్ లో ప్రచారానికి మాయావతి