Thursday, March 28, 2024
Homeసినిమా'గంధర్వ' ఫైట్ మాస్టర్లకు వెండి నాణేలు

‘గంధర్వ’ ఫైట్ మాస్టర్లకు వెండి నాణేలు

‘వంగవీటి, ‘జార్జిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక పాయింట్ తో రూపొందుతున్న ఈ చిత్రంతో అప్సర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్, బాబుమోహన్ తదితరులు ఈ చిత్రంలో  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ లకు మంచి స్పందన లభించడమే కాకుండా సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి.

ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ఇది వరకే చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు సాయికుమార్, సురేష్ తో పాటు 50మంది ఫైటర్స్ పాల్గొన్నారు. తమ ప్రాణాలను సైతం  లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఈ సినిమా కోసం పని చేసిన వారంతా ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్