Friday, June 12, 2026
Homeసినిమామల్టీస్టారర్ గా మారుతున్న 'జైలర్' పెరుగుతున్న అంచనాలు! 

మల్టీస్టారర్ గా మారుతున్న ‘జైలర్’ పెరుగుతున్న అంచనాలు! 

రజనీకాంత్ .. ట్రెండ్ కి తగినట్టుగా ప్రేక్షకుల మధ్యకి వెళ్లడం కోసం కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ ముందుకు వెళుతున్నారు. సినిమాకి .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోవడం లేదు. ముందు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ తరువాత సినిమాతో మరో ప్రయోగం చేయడానికి ఆయన వెనుకాడటం లేదు. నిజం చెప్పాలంటే గతంలో కంటే ఆయన దూకుడు పెరిగింది.

అలా ఆయన తాజా చిత్రంగా ‘జైలర్’ సినిమా సెట్స్ పై ఉంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, నెల్సన్ దిలీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ఇది ఒక జైలు చుట్టూ .. జైలర్ చుట్టూ తిరిగే కథ. సాధారణంగా రజనీ సినిమాల్లో వన్ మేన్ ఆర్మీ మాదిరిగా ఆయన ఒక్కడే చక్రం తిప్పేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ముఖ్యమైన .. కీలకమైన రోల్స్ లో ఇతర భాషలకి చెందిన స్టార్స్ ను తీసుకుంటున్నారు.

ఆ మధ్య కమల్ చేసిన ‘విక్రమ్’ సినిమా అందుకు ఒక ఉదాహరణ. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ వంటి స్టార్స్ అందులో కనిపించారు. అలాగే ‘జైలర్’లో  సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ .. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ .. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ ను తీసుకున్నారు.  ఇదంతా చూస్తుంటే ఇది ఒక భారీ మల్టీస్టారర్ అనే అనుకోవాలి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో తమన్నా .. సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో ఈ టీమ్ సక్సెస్ అవుతూనే వెళుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular