Friday, March 29, 2024
Homeసినిమా'ఇంటి నెం.13' కోసం మాల్గాడి శుభ‌ పాట

‘ఇంటి నెం.13’ కోసం మాల్గాడి శుభ‌ పాట

Kick song: రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో హేస‌న్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13‘. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ సినిమా కోసం శ్రీ‌యా గోష‌ల్ పాడిన ‘పో పోవే…’ అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

తాజాగా ఇంటి నెం. 13 చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. డిఫ‌రెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. ‘న‌ర న‌ర‌ము..’ అంటూ రాంబాబు గోశాల ర‌చించిన ఈ పాట‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందించారు. ఎంతో హుషారుగా సాగుతూ కిక్ ఇచ్చేలా ఉన్న ఈ పాట యూత్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : ‘ఇంటి నెం.13’ చిత్రం కోసం శ్రీ‌యా గోష‌ల్ సాంగ్ విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్