Monday, May 20, 2024
Homeసినిమాఈ  సినిమా నుంచి చాలా నేర్చుకోవ‌చ్చు : సుశాంత్

ఈ  సినిమా నుంచి చాలా నేర్చుకోవ‌చ్చు : సుశాంత్

Mallee Modalaindi: ‘మళ్ళీ రావా’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ నెల 11న సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రే రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువహీరోలు నికిల్ సిద్దార్థ, సుశాంత్, అడవి శేష్, విశ్వక్ సేన్, నిర్మాత బన్నీ వాసు, డి.జె టిల్లు దర్శకుడు విమల్ తదితర సినీప్రముఖులు పాల్గొని యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు  హల్ చల్ చేస్తున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో.

హీరో సుమంత్ మాట్లాడుతూ “కథ చెప్పేటప్పుడు విడాకుల గురించి చెప్పడంతో నాకు నచ్చి ఈ సబ్జెక్ట్ చేద్దామనుకున్నా. అనూప్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రేమకథ దగ్గర్నుంచి నా ప్రతి సినిమాకు ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా  ఆలోన్… ఆలోన్ అనే పాట కూడా సిగ్నేచర్ సాంగ్ అవుతుంది.  ఫిబ్రవరి11న జి5 లో మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా ను సబ్స్ క్రైబ్ చేసుకొని చూడండి అన్నారు.

హీరో అడవి శేషు మాట్లాడుతూ “నేను టైటిల్స్ చూసి ఇంప్రెస్స్ అవుతాను..నాకు ఇష్టమైన లవ్ స్టోరీ ‘మళ్లీ రావా’.. ఆ సినిమాలు చాలాసార్లు చూశాను ఆ హిట్ తో ‘మళ్లీ’ అనేది జోడించి ‘మళ్ళీ మొదలైంది’ టైటిల్ తో వచ్చాడు. నాకు ఈ టైటిల్ కూడా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ బాగుంది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా సుమంత్ కు మంచి విజయం సాదించాలని కోరుతున్నాను” అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ “ప్రతి టీజర్, ట్రైలర్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంది. ఈ సినిమా నుండి చాలా నేర్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ తెలుగులో ఎవరూ టచ్ చేయలేదు. ఈ సినిమా నాకు కూడా చూడాలని పిస్తుంది. ఈ నెల 11 న జీ5 లో వస్తున్న ఈ సినిమాను చూసి మంచి హిట్ చేయాల”ని అన్నారు.

Also Read : ‘మళ్ళీ మొదలైంది’ సుమంత్ క్యారెక్ట‌ర్ రివీలింగ్ పోస్ట‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్