Monday, March 16, 2026
HomeTrending Newsయు జి సి చైర్మన్ గా మామిడాల జగదీష్

యు జి సి చైర్మన్ గా మామిడాల జగదీష్

Mamidala Jagdish  :యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ను నియమిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్ గా జగదీష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

యూజీసీ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం మామిడాల జగదీష్ కుమార్ స్వస్థలం. జగదీష్ కుమార్ ఇంటిపేరు ఉరుపేరు ఒక్కటే కావడం యాదృచ్చికం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular