Friday, April 19, 2024
HomeTrending Newsకార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు - మంత్రి పువ్వాడ అజయ్

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు – మంత్రి పువ్వాడ అజయ్

ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి సామాన్యుడిని నాణ్యమైన, ఉన్నత విలువలు, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మన ఊరి – మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని మామిళ్ళగూడెంలో రూ.12.49లక్షలు శాంతి నగర్ లో రూ. 1.14కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేసి అన్ని మౌలిక వసతులతో ఎర్పాటు చేస్తున్నామని అన్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 సర్కార్ బడులలో రూ.7289 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని ప్రయివేటు స్కూల్ బంద్ అయి పిల్లలు అందరూ సర్కార్ స్కూళ్లకు వచ్చే విధంగా సకల వసతులు కల్పిస్తున్నామని అన్నారు.

ఖమ్మం జిల్లాలోనే దాదాపు 426 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి 12 రకాల ప్రధాన అంశాలతో వసతులు కల్పించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలో వసతులు కల్పించి ప్రతి సామాన్యుడికి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించామని ఒకవైపు బోధన, మరోవైపు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పిల్లలు పుస్తక పఠనంతో పాటు నేర్చుకునేందుకు డిజిటల్ తరగతులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మన ఊరు-మన బడి వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరుగుతాయయని, ఇక నుండి మరింత బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

స్కూళ్లలో సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడల పైన దృష్టి పెట్టాలని, వచ్చే విద్యా సంవత్సరంలో సర్కారు బడులలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగే విధంగా సిబ్బంది నాణ్యమైన విద్యాబోధనను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మయోర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, సుడా చైర్మన్ విజయ్, DCCB చైర్మన్ కురాకుల నాగభూషణం, DEO సోమశేఖర్ శర్మ, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, MEO లు, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్