సందీప్ కిషన్ హీరోగా ‘మైఖేల్‘ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం సందీప్ 20 కేజీల వరకూ బరువు తగ్గడం విశేషం. ఈ సినిమాలో ఆయన చేసిన ఫైట్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 3వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది. నాని చీఫ్ గెస్టుగా నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది.

ఈ వేదికపై సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ఈ సినిమా కోసం పడిన కష్టం ఇంతవరకూ తాను ఏ సినిమా కోసం కూడా పడలేదని అన్నాడు. ఎంతవరకూ ఎఫర్ట్ పెట్టాలో అంతవరకూ ఎఫర్ట్ పెట్టడం వలన, ఫలితాన్ని గురించిన టెన్షన్ తనకి లేదని చెప్పాడు. సందీప్ కిషన్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో తాను నానీనే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతుంటానని అన్నాడు.

ఇక ముఖ్య అతిథిగా వచ్చిన నాని మాట్లాడుతూ .. ఈ సినిమా టీజర్ ను .. ట్రైలర్ ను తాను చూశాననీ, కొత్త టోన్ తో తనకి చాలా డిఫరెంట్ గా అనిపించిందని చెప్పాడు. ట్రైలర్ లో ఉన్న విషయం సినిమా అంతటా ఉంటే ఆడియన్స్ తప్పకుండా హిట్ చేసి పెడతారని అన్నాడు. సందీప్ చాలా కష్టపడతాడు .. మంచి టాలెంట్ ఉంది. ఈ సినిమాతో అదృష్టం కూడా తోడు కావాలని తాను కోరుకుంటున్నానని అన్నాడు. ‘శివ’ మాదిరిగా ఈ సినిమా కొత్త ట్రెండును సృష్టించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Also Read : ‘మైఖేల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన బాలకృష్ణ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *