మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి మెహన్ రాజా దర్శకత్వం వహించారు. చిరు, సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయడంతో మెగాభిమానులు గాడ్ ఫాదర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ సినిమా కంటే ముందుగా నాగార్జున ‘ది ఘోస్ట్’ ను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో చిరు, నాగ్ మధ్య పోటీ అనుకుంటుంటే.. నేనున్నాను అంటూ మంచు విష్ణు ‘జిన్నా’ను కూడా అదేరోజున రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాలు నిజంగానే అక్టోబర్ 5న వస్తాయా? వాయిదా పడతాయా? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. జిన్నా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో అక్టోబర్ లో రిలీజ్ అని ప్రకటించారు కానీ.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పలేదు. దీంతో చిరు, నాగ్ సినిమాలతో పోటీపడే విషయంలో విష్ణు ఆలోచనలో పడ్డాడని వార్తలు వస్తున్నాయి. మరి.. విష్ణు జిన్నా రిలీజ్ డేట్ పై త్వరలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read : మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ రిలీజ్