Sunday, January 19, 2025
Homeసినిమా'ప్రేమలు' రేంజ్ లో 'మంజుమ్మెల్ బాయ్స్'!   

‘ప్రేమలు’ రేంజ్ లో ‘మంజుమ్మెల్ బాయ్స్’!   

తెలుగులో ఈ మధ్య కాలంలో సరైన టీనేజ్ లవ్ స్టోరీ రాలేదని అంతా అనుకుంటున్న సమయంలో  మలయాళం నుంచి ‘ప్రేమలు’ వచ్చింది’. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నస్లెన్ – మమిత బైజు జంటగా నటించారు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ మలయాళంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అయిపోయింది. ఈ ఏడాదిలో భారీ వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఇది చేరిపోయింది.

అలాంటి ఈ సినిమాను తెలుగులోను విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా కోసం పెద్దగా ప్రమోషన్స్ జరగలేదు. ఓటీటీ సినిమాలు చూసేవారికి తప్ప నస్లెన్ – మమిత బైజు పెద్దగా తెలియదు. అయినా కంటెంట్ పై నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. రెండు వారాల నుంచి థియేటర్స్ లో  ఈ సినిమా సందడి చేస్తూనే ఉండటం విశేషం. మంచి లాభాలను కూడా తీసుకొచ్చి దోసిట్లో పెట్టేసింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళం నుంచి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ‘మంజుమ్మెల్ బాయ్స్’ సిద్ధమవుతోంది.

‘మంజుమ్మెల్ బాయ్స్’ ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా.. అప్పట్లో కొంతమంది కేరళ కుర్రాళ్లు తమిళనాడులోని ఒక గుహలోకి వెళ్లి తిరిగి బయటికి రావడానికి చాలా రిస్క్ పడ్డారు. ఆ సంఘటన నేపథ్యంగా ఈ కథ నడుస్తుంది. మలయాళంలో 200 కోట్లకి పైగా కొల్లగొట్టిన ఈ సినిమా, ఏప్రిల్ 6వ తేదీన ఇక్కడి థియేటర్లకు రానుంది. ‘ప్రేమలు’కి ఇక్కడ టైటిల్ ప్లస్ అయింది. కథ కూడా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. అందువలన ఈ కంటెంట్ ఇక్కడ ఈజీగా కనెక్ట్ అయింది. మరి ఆ రేంజ్ లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ కనెక్ట్ అవుతుందా .. లేదా? అనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్