Sunday, January 19, 2025
HomeTrending Newsమార్క్ 3 ప్రయోగానికి ఇస్రో తుది పరిశీలన

మార్క్ 3 ప్రయోగానికి ఇస్రో తుది పరిశీలన

అత్యంత భారీ రాకెట్ లాంచ్ వెహికిల్ మార్క్ -LVM3ని… ఇస్రో ప్రయోగించనుంది. ఈనెల 23న… ఆ రాకెట్ నింగికి దూసుకెళ్లనుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను… ఆ రాకెట్ మోసుకెళ్లనుంది. శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం రేపు (ఆదివారం) జరగనుంది. లాంచ్ వెహికిల్ మార్క్ 3ని గతంలో… GSLV మార్క్ 3 అని పిలిచేవారు. అక్టోబర్ 23న ఉదయం ఏడు గంటలకు.. LVM 3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ప్రస్తుతం రాకెట్ కు చెందిన క్రయో స్టేజ్ .., ఎక్విప్మెంట్ బే అసెంబ్లింగ్ ముగిసినట్లు ఇస్రో తెలిపింది. వాహకనౌకకు ఉపగ్రహాలను కూడా అమర్చినట్లు ఇస్రో వెల్లడించింది. రాకెట్ తుది పరిశీలన నడుస్తున్నట్లు…. ఇస్రో వర్గాలు వివరించాయి. LVM 3 రాకెట్ ..సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను… జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ వరకు మోసుకెళ్లగలదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్