Saturday, June 13, 2026
HomeTrending Newsఆయిల్ ఫెడ్ నుండి స్వచ్ఛమైన గానుగ నూనె

ఆయిల్ ఫెడ్ నుండి స్వచ్ఛమైన గానుగ నూనె

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నుండి వంటకు సంబంధించిన స్వచ్చమైన గానుగనూనె ను అందుబాటులోకి తెచ్చారు. ఎటువంటి కల్టీకి ఆస్కారం లేకుండా తయారు చెయ్యడంతో పాటు కెమికల్స్ కలుపకుండా ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఈ గానుగనూనె తయారు అవుతుంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా మార్క్ ఫెడ్ గానుగనూనే అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular