Thursday, April 18, 2024
Homeసినిమాషాకింగ్ లుక్ లో రామ్..?

షాకింగ్ లుక్ లో రామ్..?

రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో రామ్ ని ఎలా చూపించనున్నాడు..? అసలు కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఈ సినిమాకి సంబంధించి కథ ఏంటి అనేది అసలు బయటకు రాలేదు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

అయితే… బోయపాటి సక్సెస్ ఫార్ములా అయిన డ్యూయల్ రోల్ ని ఈ సినిమా కోసం కూడా వాడుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమాలో రామ్ రెండు భిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అందులో ఒక పాత్ర 50 ఏళ్ళ మధ్య వయస్కుడిగా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని చాలా పవర్ ఫుల్ గా బోయపాటి రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఆ ఎపిసోడ్స్ లో రామ్ తండ్రి పాత్రలో 50 ఏళ్ళ వ్యక్తిగా కనిపిస్తాడని… ఈ పాత్ర చాలా  ఎఫెక్టివ్ గా కథని మరో లెవల్ కి తీసుకొని వెళ్ళేలా ఉంటుందని సమాచారం.

ఈ నేపధ్యంలో రామ్ పోతినేని కూడా ఈ 50 ఏళ్ళ వ్యక్తి పాత్రని చాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఖచ్చితంగా ఈ పాత్ర అభిమానులకి సర్ప్రైజ్ గా ఉంటుందట. ఇక రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ చేసిన సినిమాలు ‘రెడ్’, ‘వారియర్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అందుచేత ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధించి తీరాల్సిన పరిస్థితి. మరి.. రామ్ కి, బోయపాటి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్