Monday, June 15, 2026
Homeసినిమా'మాయగాడు' ట్రైలర్ కు విశేష స్పందన

‘మాయగాడు’ ట్రైలర్ కు విశేష స్పందన

అందాల రాక్షసి సినిమాతో నవీన్ చంద్ర టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో ముఖ్య పాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు. ఇటీవలి  వీర సింహా రెడ్డి సినిమా లో కూడా మంచి పాత్ర పోషించాడు.   ప్రస్తుతం నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరో హీరోయిన్స్‌గా… ‘అడ్డా’ ఫేం.. జీ.ఎస్. కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా‘మాయగాడు’. స్వాతి పిక్చర్స్ బ్యానర్‌ పై, భార్గవ్ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాయత్రీ సురేష్ ‘నేను లేని నా ప్రేమకథ’, ‘జమ్నా ప్యార్’, ‘కళా విప్లవం’, ‘ప్రణయం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను  దీనిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో  సినిమా రిలీజ్ చేయనున్నారు. అభిమన్యు సింగ్, కబీర్ సింగ్, జయప్రకాష్ రెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ఈ సినిమాలో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular