Saturday, June 13, 2026
Homeసినిమాపవన్ మూవీపై ఆ వార్తల్లో వాస్తవం లేదట!

పవన్ మూవీపై ఆ వార్తల్లో వాస్తవం లేదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నాడు.  క్రిష్‌ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఆలస్యమైంది. ఎట్టకేలకు సమ్మర్ కి విడుదల చేయాలని  అనుకుంటున్నారు కానీ.. దసరాకి కానీ రాదని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజిత్ తో  చేస్తోన్న ‘ఓజీ’ అనే సినిమా నిన్ననే ప్రారంభమైంది. ఈ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

‘రన్ రాజా రన్’ మూవీతో సుజిత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘సాహో’ విఫలమైనా భారీ చిత్రాలను బాగా హ్యాండిల్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ ని సాహో ఆకట్టుకుంది.

అయితే ‘ఓజీ’ గ్యాంగ్ స్టర్ మూవీ అని.. ఇందులో పాటలు, ఫైట్స్ ఉండవని.. పవన్ కళ్యాణ్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పవన్ అభిమానులతో పాటు సినీ జనాలు కూడా షాక్ అయ్యారు. ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో వాస్తవం ఏంటంటే.. ఇందులో పాటలు, ఫైట్స్ ఉంటాయట. పవన్ కళ్యాణ్ ని అభిమానులు పవర్ ఫుల్ గా ఎలా చూడాలనుకుంటారో అలా కనిపిస్తారట.

Also Read : రాజమౌళి రిలీజ్ చేసిన ‘దసరా’ టీజర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular