Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ధోనీ చెన్నైకు ఆడాలి : స్టాలిన్ ఆకాంక్ష

ధోనీ చెన్నైకు ఆడాలి : స్టాలిన్ ఆకాంక్ష

Stalin-Dhoni-CSK :
మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) కు చాలా సీజన్ల పాటు ఆడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. ఐపీఎల్ 2021 టైటిల్ ను చెన్నై గెల్చుకున్న సందర్భంగా సిఎస్కే యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  ఈ ఈవెంట్ కు తాను సిఎంగా హాజరుకాలేదని, ధోని అభిమానిగా హాజరయ్యానని చెప్పారు. తన తండ్రి కరుణానిధి కూడా ధోనికి పెద్ద అభిమాని అని వెల్లడించారు. ధోని జార్ఖండ్ కు చెందినప్పటికీ  ఐపీఎల్ తో తమిళనాడు వ్యక్తిగానే అందరికీ సుపరిచితులయ్యరని అన్నారు. ఆటలో మంచి పరిణితి ప్రదర్శిస్తూ, క్లిష్ట పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఓ మంచి ఆటగాడిగా, సారధిగా, మిస్టర్ కూల్ గా అందరి మన్ననలు పొందారని స్టాలిన్ దోనిని కొనియాడారు.

ఈఏడాది ఐపీఎల్ విజేతగా అవతరించిన చెన్నై జట్టుతో పాటు యాజమాన్యాన్ని కూడా స్టాలిన్ అభినందించారు. మరికొంత కాలంపాటు చెన్నై సారధిగా సేవలందించాలని స్టాలిన్ ధోనీకి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బిసిసిఐ కార్యదర్శి జై షా, ఐపీఎల్ బ్రిజేష్ పటేల్ కూడా పాల్గొన్నారు.

Also Read :ఇండియా క్లీన్ స్వీప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్