Friday, March 29, 2024
HomeTrending Newsఎవరి కోసం ఉపఎన్నికలు - మంత్రి హరీష్

ఎవరి కోసం ఉపఎన్నికలు – మంత్రి హరీష్

దశాబ్దాల కల ఈరోజు నిజం అయ్యిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ తో సాధ్యం అయ్యిందని మంత్రి హరీష్ రావు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ పాయింట్ ప్రారంబించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం రూ . 100 కోట్లు ఖర్చు చేస్తే ఈ రైలు వచ్చిందని, త్వరగా రైలు రావాలని మన వాటా కట్టి ఏర్పాటు చేశామన్నారు.

ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సనత్ నగర్ గోడౌన్ కి పంపుతున్నాము. ఇప్పుడు ఇక్కడే స్టాక్ చేసి దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపుతామని మంత్రి తెలిపారు. కొందరు ఉప ఎన్నిక అంటున్నారు. ఎందుకు ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీలు రోజుకు రెండు సార్లు అటెండెన్స్ ఇవ్వాలా. పథకం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రాన్ని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అంటే ఇవ్వరంట…వరంగల్ కు రైల్వై కోచ్ ఇవ్వమంటే ఇవ్వరంట..బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరంట… ఐటీఐఆర్ ఇవ్వరంట… కాని ఉపఎన్నిక మాత్రం తెస్తరట అని మండిపడ్డారు. ఉపఎన్నిక కోసం మాట్లాడుతున్న వారిని అడుగుతున్నా.. మీరు తెస్తామంటున్న ఉపఎన్నిక వల్ల తెలంగాణకు ఏ లాభం… ప్రజలకు ఏం లాభం. రాష్ట్రానికి ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ తెస్తారా…పాలమూరుకు జాతీయ ప్రాజెక్టు ఇప్పిస్తరా…అన్నారు. మాటలు చెప్పేది ఎవరో…చేతల్లో అభివృద్ధి చూపెడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి హరీష్ రావు అన్నారు.

దశాబ్దాల కాలం పాటు ఎదురు చూసిన మంచి ఘడియ ఇదని, రాష్ట్ర వ్యవసాయ శాఖ రేక్ పాయింట్ కోసం కృషి చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. నాడు ఇందిరాగాంధీ రైలు తెస్తా అన్నారు. తేలేదు. కానీ కేసీఆర్ తెచ్చారన్నారు. రాబోయే రోజుల్లో ప్యాసింజర్ రైలు వస్తుంది. ఆలస్యం లేకుండా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా చేర వేసేందుకు ఉపయోగ పడుతుందని మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్