Saturday, January 18, 2025
HomeTrending Newsరాష్ట్రాలకు కేంద్రం షాక్...సొంత మీడియా లొద్దు

రాష్ట్రాలకు కేంద్రం షాక్…సొంత మీడియా లొద్దు

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ప్రారంభిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై సొంతంగా మీడియా ఛానళ్లను ప్రారంభించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలు నడుపుతున్న ఛానళ్లు కూడా తమ కంటెంట్ ను ప్రసారభారతి(డీడీ)లోనే ప్రసారం చేసుకోవాలని సూచించింది.

దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ఛానళ్ల ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలాగే ఇప్పటికే సొంతంగా మీడియా ఛానళ్లు నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రప్రభుత్వాలు నడుపుతున్న మీడియా ఛానళ్ల కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు,పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య తలెత్తుతోందని ట్రాయ్ భావిస్తోంది. దీంతో ట్రాయ్ సూచనల మేరకు వీటిని నియంత్రించేందుకు కేంద్రం సిద్దమైంది. సొంత మీడియాలొద్దన్న కేంద్రం,కేంద్ర,రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాల మంత్రిత్వ శాఖ లేదా శాఖలు,వాటి అనుబంధ సంస్థలు భవిష్యత్తులో ప్రసార కార్యకలాపాలను ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడంలో ప్రవేశించ కూడదని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా సూచించింది. ప్రసారానికి సంబంధించిన అన్ని విషయాలకు సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీ అని పేర్కొంటూ పోస్ట్‌లు,టెలిగ్రాఫ్‌లు, టెలిఫోన్‌లు,వైర్‌లెస్, బ్రాడ్‌కాస్టింగ్,ఇతర రకాల కమ్యూనికేషన్‌లు, లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రత్యేక హక్కు కల్పించే అధికారం కేంద్రానికే ఉందని స్పష్టం చేసింది.

ఇప్పటికే నడుపుతున్న వారు డీడీకి మార్పు. ఇప్పటికే తమ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాచారాన్ని ప్రసార భారతి ద్వారా  కొనసాగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇలా తమ కంటెంట్ ను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసుకునేందుకు వచ్చే ఏడాది డిసెంబర్ 23 వరకూ కేంద్రం గడువు ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో సొంత ఛానళ్ల ద్వారా కంటెంట్ ప్రసారం చేసుకుంటున్న ప్రభుత్వాలు వచ్చే ఏడాది లోగా డీడీకి మారాల్సి ఉంటుంది. అప్పుడు తమ సొంత ఛానళ్లను మూసేయాల్సి వస్తుంది.

ఏపీ సహా పలు రాష్ట్రాలపై ప్రభావం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సు,క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు,న్యాయ శాఖ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేసినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుబోతోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఏపీ,తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలపై దీని ప్రభావం పడబోతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐపీటీపీని నడుపుతుండగా.. తమిళనాడులో కల్వీ టీవీ,అరసు కేబుల్ కూడా నడుపుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఇవి మూతపడాల్సి రావొచ్చని భావిస్తున్నారు.

Also Read : వార్తా వ్యాపారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్