Sunday, June 14, 2026
HomeTrending Newsఇదే ఏడాది మెదక్ కు మెడికల్ కాలేజీ -మంత్రి హరీష్

ఇదే ఏడాది మెదక్ కు మెడికల్ కాలేజీ -మంత్రి హరీష్

మెదక్ కు ఈ ఏడాదిలోనే మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరుగుతుందని శాసన సభలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని రాష్ట్రం ఏర్పడ్డ నాడు 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 2790 కి పెంచామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలు.. ఆనాడు మూడు ఏర్పాటు చేస్తే, మేము ఒక్క ఏడాదిలో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి తెలిపారు.

ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే 5 మెడికల్ కాలేజీలు వస్తాయని కలలో అయినా అనుకున్నారా అని మంత్రి విపక్షాలను ప్రశ్నించారు. ములుగు, సంగారెడ్డిలో మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, నాటి మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు.

కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలు ప్రారంబించారని హరీష్ చెప్పారు. బీబీ నగర్ ఎయిమ్స్ పరిస్థితి దారుణంగా ఉందని, ఐపీ లేదు, ఓపీ లేదు, ఆపరేషన్లు చేయరన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ చేసే అవకాశం కల్పించామన్నారు. అన్ని జిల్లాల్లో పారామెడికల్ కోర్సులు ప్రారంభిస్తున్నం.
మెడికల్, నర్సింగ్ తో పాటు పారామెడికల్ కాలేజీలు వస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాడే ఎయిర్ సాంప్లార్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుతున్నాం. 1457 అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీ నెల రోజుల్లో పూర్తి చేసి, మెడికల్ కాలేజీల్లో ఒక్క ఖాళీ లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఫిల్మ్ నగర్ పి హెచ్ సి కొత్త భవనం మంజూరు చేస్తామని ప్రకటించారు.

Also Read : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా – కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular