Saturday, July 27, 2024
HomeTrending Newsఅంతర్జాతీయ సాయం కోసం పాక్ తంటాలు

అంతర్జాతీయ సాయం కోసం పాక్ తంటాలు

పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)తో బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై చర్చిస్తున్నది. ఈ చర్చలు సఫలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్‌ ఫైనాన్సింగ్‌ ఎస్టిమేషన్‌, దేశీయ ఆర్థిక చర్యలను ఖరారు చేయడంలో విఫలమవడంతో చర్చలు తలకిందులయ్యాయి. బుధవారం రాత్రి వరకు ఆర్థిక విధానాలకు సంబంధించిన ముసాయిదా మెమోరాండం (MEFP) అందలేదని, చివరి కార్యాచరణ ప్రణాళికపై అభ్యంతరాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని సీనియర్‌ ప్రభుత్వ అధికారి గురువారం తెలిపారు.

ఐఎంఎఫ్‌కు ఈ రోజు (శుక్రవారం) వరకు మెమోరాండం సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ హయాంలో 2019లో పాక్‌ 6 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్‌ సహాయాన్ని పొందింది. గతేడాది దీన్ని ఏడు బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెంచారు. పేలవమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్‌ నుంచి పాక్‌ ఆర్థిక సాయం పొందలేకపోయింది.

తాజాగా 1.18 బిలియన్‌ డాలర్ల కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అయిషా గౌస్‌ పాషా మాట్లాడుతూ ఆర్థిక విధానాలను ఖరారు చేస్తున్నామని, అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాత ఆర్థిక విధానాలకు సంబంధించిన ముసాయిదా మెమోరాండం (MEFP) ఐఎంఎఫ్‌కు అందిస్తామన్నారు.

Also Read : రాత పరీక్ష కోసం ఇస్లామాబాద్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్