Medical Colleges: సమ్ ఏంజెల్స్ హ్యావ్‌ స్టెతస్కోప్స్‌: సిఎం జగన్

ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయినుంచి పాలనా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని, దీనిలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖలో కూడా సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరంలో పర్యటించిన సిఎం జగన్ అక్కడ నెలకొల్పిన మెడికల్‌ కాలేజీ ప్రత్యక్షంగా… రాష్ట్రంలోని నాలుగు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాలేజీలను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విద్యార్ధులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో పేదలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ‘మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి’ అని వ్యాఖ్యానించారు.  మెడికల్‌ కాలేజీ  ఏర్పాటుతో ప్రొఫెసర్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్లు అందుబాటులో ఉంటారని, తద్వారా ఒక ఓ గొప్ప మార్పు టెరిషరీ కేర్‌లో జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

రూ.8,480 కోట్లు ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నామని, వాటిలో ఐదింటిని నేడు ప్రారంభించి అడ్మిషన్లు కూడా మొదలు పెట్టామని చెప్పారు.  విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు నేడు ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను అడ్మిషన్‌ స్థాయికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లు 2,185 కాగా ఈ 17 మెడికల్‌ కాలేజీలు పూర్తయితే ఈ సంఖ్యం ఏకంగా 4,735కు పెరుగుతుందన్నారు.

సిఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు:

 • ఇప్పటి వరకు బటన్‌ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం.
 •  ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. రేషన్‌ కార్డు, రేషన్‌ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం.
 • ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా అని వెతికి, అప్లికేషన్‌పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం.  22 లక్షల ఇళ్లు వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.
 • ఎవరికి ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అవసరాలు తీరుస్తున్నాం.
 • జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం.
 • జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించాం.  ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏరకమైన సమస్య ఉన్నా 7 రకాల టెస్టులు, 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం.
 • 4వ ఫేజ్‌ హెల్త్‌ క్యాంపు, సెప్టెంబర్‌ 30న మొదటి హెల్త్‌ క్యాంపు, తర్వాతి 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపులు విస్తరించి పూర్తవుతాయి.
 • గ్రామం మొత్తం మ్యాపింగ్‌ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. తర్వాత హ్యాండ్‌ హోల్డింగ్‌ చేయబోతున్నాం.
 •  ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా అడుగులు వేయబోతున్నాం.

 •  మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నా.
 • కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి.
 • నాట్‌ ఆల్‌ ఏంజిల్స్‌ హావ్‌ వింగ్స్‌. సమ్‌ హ్యావ్‌ స్టెతస్కోప్స్‌. కీప్‌ దిస్‌ ఇన్‌మైండ్‌.
 • ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టా.
 • ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమం, మంచి పోస్టు గ్రాడ్యుయేట్లు, మంచి డాక్టర్లుగా అవుతారు. ఆల్‌ ద వెరీ బెస్ట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *