19.1 C
New York
Thursday, October 5, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమా కొద్దీ సినీ దేవుళ్ళు

మా కొద్దీ సినీ దేవుళ్ళు

One-man Show:
జైలర్ సినిమాలో వెతికితే సందేశముంది.

పెద్దపెద్ద హీరోల చిన్నచిన్న వేషాలున్నాయి.
విపరీతమైన సెంటిమెంటూ ఉంది.
ఎంటర్టైన్మెంట్ కోసం తమన్నా క్లబ్ సాంగ్ ఉంది.
హింస బీభత్స భయానకంగా ఉంది.
మొదటినుంచి చివరిదాకా హీరో ఒక్కడై సినిమా నడిపించాడు …. ఇదే కదా ఇప్పటి హిట్ సినిమా ఫార్ములా అనుకుంటున్నారా? అబ్బే అంత సీన్ లేదు.

అసలు సినిమా అనేది వినోదసాధనమా వికారసాధనమా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒకప్పుడు రజనీకాంత్ సినిమా అంటే ఎంతో కొంత వినోదం ఉండేది. చంద్రముఖి వరకూ ఈ ట్రెండ్ సాగింది. భాషా సినిమా నుంచి కాస్త మార్పు మొదలైంది. కబాలి నాటికి విసుగ్గా పరిణమించింది. వినోదం కన్నా సందేశాలు,హింస ఎక్కువైపోయాయి. కాలా, దర్బార్, పేట … ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా ఏ మాత్రం మార్పులేకుండా కేవలం హింసని నమ్ముకుని తీసిన సినిమా జైలర్.

గుళ్ళల్లో విగ్రహాలు దొంగిలించడం అనే సిల్లీ పాయింట్ తో మొదలైన సినిమా అడుగడుగునా మన సహనానికి పరీక్ష పెడుతుంది. కొడుకుని నీతిగా పెంచాననే తండ్రి, కొడుకే అవినీతికి పాల్పడ్డాడని తెలిసి చివరకి అంతం చేస్తాడు. ఇదో గొప్ప సామాజిక సందేశాత్మక చిత్రమట. అసలు విలన్ అనేవాడు, అతని చుట్టూ ఉన్నవాళ్లు అంత భయంకరంగా ఉండటం అవసరమా? ఎందుకు చంపుతారో అర్థం కాదు. పాత సినిమాల్లో లాగా చంపేసి రసాయన ద్రావణంలో పడేస్తారు. ఇది దర్శకుడి భావ దరిద్రానికి పరాకాష్ట.

ఇక శివరాజ్ కుమార్ , మోహన్ లాల్, జాకీ షరాఫ్ , సునీల్ పాత్రలు దయనీయం, దారుణం. అన్ని మసాలాలు ఉండాలనేమో ఈమధ్య బట్టలిప్పుకుని తిరుగుతున్న తమన్నా పాటొకటి మధ్యలో. ఒకప్పుడు ప్రత్యేక పాటల కోసం ప్రత్యేక డాన్సర్లు ఉండేవారు. ఇప్పుడు వారి ఉపాధికీ గండికొడుతున్నారు హీరోయిన్స్ అనేవారు. ఇక మిగిలిన పాత్రల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.

సినిమా ప్రారంభంలో సుత్తుల బాదుడుతో సన్నగా మొదలయ్యే తలనొప్పి పూర్తి సినిమా చూస్తే ఒళ్ళంతా నొప్పులు, చలి జ్వరంగా మారితే ఆశ్చర్యపోనక్కరలేదు. దేవుడా! రక్షించు నా దేశాన్ని సినీ దేవుళ్ళ బారినుంచి. వారి అభిమాన భక్తులనుంచి.

పి.ఎస్: ఇంతకన్నా చెత్త సినిమాలు ఎన్నో వచ్చాయి ఈ సినిమా పైనే పడి ఏడవడం ఎందుకు అనుకుంటారేమో, రజనీకాంత్ ఇంత చెత్త క్యారెక్టర్ చెయ్యడం ఇంతకుముందు చూడలేదు మరి.

-కె. శోభ

K Sobha Sree
K Sobha Sree
జర్నలిజం, మేనేజ్ మెంట్, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో డిప్లొమా. ప్రింట్ మీడియాలో పదేళ్ల అనుభవం. కాలమిస్టుగా, ఫ్యామిలీ కౌన్సిలర్ గా పదేళ్ల అనుభవం
RELATED ARTICLES

Most Popular

న్యూస్