Monday, June 15, 2026
HomeసినిమాKeedaa Cola: తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' విడుదల తేదీ ఖరారు

Keedaa Cola: తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ విడుదల తేదీ ఖరారు

తరుణ్ భాస్కర్ తెరకెకిస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘కీడా కోలా’ ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో క్యురియాసిటీని పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 3న ‘కీడా కోలా’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రిలీజ్ డేట్ పోస్టర్ లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్ లో కనిపించడం ఆసక్తికరంగా వుంది. కీడా కోలా విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏజే ఆరోన్ డీవోపీగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ మూడవ చిత్రాన్ని వెంకటేష్ తో చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ విభిన్న కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి.. ఈ మూవీతో కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular