Saturday, January 18, 2025
Homeసినిమాచిరు 154వ చిత్రం ఫస్ట్ లుక్ అరాచకం

చిరు 154వ చిత్రం ఫస్ట్ లుక్ అరాచకం

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో ఈ రోజు మొదలైంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. దర్శకుడు బాబీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించారు. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించారు. గ్యాంగ్ లీడర్ టైమ్ లో చిరు ఎలా ఉండేవారో.. అలా ఈ స్టిల్ ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. చిరు లుక్‌ చూసి అభిమానులు అయితే.. ఈలలు వేస్తున్నారు.

అంతే కాకుండా.. మాస్‌ పూనకాలు మొదలాయే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై ఈ చిత్రం రూపొందుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వీరాభిమాని తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫస్ట్ లుక్కే అరాచకం అన్నట్టుగా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్