Thursday, April 25, 2024
Homeసినిమామెగాస్టార్ మూవీ దానికి సీక్వెల్?

మెగాస్టార్ మూవీ దానికి సీక్వెల్?

Chiru Sequel: మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన‌ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తూ… కెరీర్ లో దూసుకెళుతున్నారు. చిరు న‌టించిన తాజా చిత్రం ఆచార్య. ఏప్రిల్ 1న ఆచార్య విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి గాడ్ ఫాద‌ర్, భోళా శంక‌ర్, వాల్తేరు వీర‌య్య సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలు సెట్స్ పై ఉండ‌గానే.. చిరంజీవి యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుమ‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు.

వెంకీ కుడుముల ఛ‌లో, భీష్మ చిత్రాల‌తో వ‌రుస‌గా సక్స‌స్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం విశేషం. చిరు, వెంకీ కుడుముల కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడ్యూస‌ర్ డివివి దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవ‌ల అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఏంటంటే… ఈ మూవీ ముఠామేస్త్రీ సినిమాకి సీక్వెల్ అనేట్టుగా ఉంటుందట‌. చిరంజీవి క్యారెక్ట‌ర్ ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంద‌ని.. మెగా అభిమానుల‌కు అయితే.. పండ‌గే అనేట్టుగా ఉంటుంది అంటున్నారు. అంతే కాకుండా.. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు స‌స్పెన్స్ తో సాగేలా ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. మ‌రి… చిరు అభిమాని అయిన వెంకీ కుడుముల మెగాస్టార్ ను ఎలా చూపిస్తారో.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్