Saturday, November 23, 2024
HomeTrending Newsమేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

మేఘాలయ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రధానిపైనే గురిపెట్టారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీలో పార్టీలో పెద్దల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతుల ఉద్యమ సమయంలో ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. రైతులకు మద్దతుగా నిలిచారు గవర్నర్ సత్యపాల్ మాలిక్.

తాజాగా ఆయన మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీనే టార్గెట్ చేశారు. గతంలో రైతు సమస్యలపై మాట్లాడటానికి వెళ్లినప్పుడు మోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడరని అన్నారు. రైతు ఉద్యమంలో రైతులు చనిపోతున్నారని చెప్పినప్పుడు.. రైతులు ఏమైనా నాకోసం చనిపోతున్నారా.. అని అన్నారని మాలిక్ తెలిపాడు. ఈ విషయమై తాను మోదీతో కొద్ది సమయం యుద్దమే చేశానని చెప్పుకొచ్చాడు.

హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలిసి రైతు సమస్యల గురించి మాట్లాడాను. అయితే మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని ఆయన అడిగారు. చాలా అహంకారంగా మాట్లాడారు’’ అని మాలిక్ అన్నారు. ప్ర‌ధాని ప్ర‌శ్న‌కు తాను అవును అని స‌మాధానం చెప్పాన‌ని మాలిక్ పేర్కొన్నారు. మీరు రాజు కాబ‌ట్టి రైతుల మ‌ర‌ణాల‌కు మీరే బాధ్యుల‌ని చెప్పాన‌ని తెలిపారు. త‌ర్వాత ప్ర‌ధాని త‌నకు హోంమంత్రి అమిత్‌షాను క‌లిసి మాట్లాడ‌మ‌ని చెప్పార‌ని, ఆయ‌న చెప్పిన‌ట్లే తాను అమిత్ షాను క‌లిశాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా ప్ర‌ధానిని ఉద్దేశించి ‘స‌త్యా ఆయ‌న‌కు మతి త‌ప్పింది’ అని వ్యాఖ్యానించిన‌ట్లు ఆరోపించారు. కుక్క చ‌చ్చినా సంతాప లేఖ పంపే ప్ర‌ధాని రైతుల మ‌ర‌ణాల‌పై స్పందించ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక ప్ర‌ధానితో పోరాటానికి స్వ‌స్తి ప‌లుకుతున్నాన‌ని అన్నారు.

గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఎన్డీఏ గ‌వ‌ర్న‌మెంట్ అపాయింట్ చేసిన గ‌వ‌ర్న‌ర్ నోటి నుంచి ఈ మాట‌లు రావ‌డం నిజంగా షాకేన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాలిక్ వ్యాఖ్య‌ల వీడియోను కేటీఆర్ షేర్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్