Sunday, January 19, 2025
HomeTrending Newsయాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : మేకపాటి

యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : మేకపాటి

Industries – Action Plan: రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టులపై 2022-23 యాక్షన్ ప్లాన్ ను త్వరితగతిన తయారు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. తాను నిర్వహిస్తోన్న శాఖల పురోగతిపై వెలగపూడి సచివాలయంలోని ఐ.టీ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల వారీ  ప్రగతిపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ను  అడిగి వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం చెన్నై కారిడార్ పురోగతిపైనా మంత్రి ఆరా తీశారు. ఫిబ్రవరి 4వ తేదీన మళ్లీ సమావేశం కావాలని, ఆ రోజుకు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నివేదిక అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

నెల్లూరు జిల్లా క్రిస్ సిటీ  పురోగతిపై ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం మంత్రికి వివరాలు అందించారు. ఇప్పటికే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు పరిశ్రమలలోని అన్ని విభాగాలు వేర్వేరు పోర్టల్ లను నిర్వహించుకుంటున్నాయని, సోషల్ మీడియా వేదికగా అన్ని విభాగాలను ఒకే వెబ్ సైట్ గా మార్చే ప్రక్రియను సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈడీబీ, ఎమ్ఎస్ఎమ్ఈ, ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డుల వంటి అన్ని విభాగాలను పరిశ్రమల శాఖ వెబ్ సైట్ లో లింక్ ద్వారా ఓపెన్ చేసే వీలుగా వెబ్ సైట్ విండో తయారు చేయాలన్నారు.  విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పై ప్రత్యేకంగా చర్చించేందుకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనతో సమావేశం కావాలని నిర్ణయించారు.

పరిశ్రమల శాఖలోని కీలక కార్యక్రమాలపై తగిన ప్రచారం కల్పించేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజనను ఆదేశించారు. ఈ సందర్భంగా లాజిస్టిక్ పాలసీ, ఈవీ పాలసీల గురించి వివరాలు తెలుసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల శాఖ బడ్జెట్ అంచనాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రోత్సాహకాలకు ప్రాధాన్యతనిచ్చేలా బడ్జెట్ పై కసరత్తుకు పలు కీలక సూచనలిచ్చారు.

వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షకు  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఏడీసీ ఎండీ వీ.ఎన్ భరత్ రెడ్డి, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి,ఏపీటీపీసీ ఎండీ ప్రతాప్ రెడ్డి, ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో పవన మూర్తి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఇతర పరిశ్రమల శాఖ అధికారులు హాజరయ్యారు.

Also Read : 18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్