Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్

హైదరాబాద్‌లో అతిపెద్ద డేటా సెంటర్

Microsoft Data Center At Hyderabad :

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ సోమవారం నాడు ప్రకటించారు.

 

2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం తెలంగాణ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.15వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది.

 

కాగా మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమెరికాలోని రేమండ్‌లో ఉన్న డేటా సెంటర్ కంటే పెద్దది అవుతుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కి పుణె, ముంబై, చెన్నైలలో డేటా సెంటర్లు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్