Saturday, January 18, 2025
HomeTrending Newsమైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం... ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం… ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో కాన్ఫిగరేషన్ మార్పు వల్ల మైక్రోసాఫ్ట్ 365 సేవలకు విస్తృతంగా అంతరాయం కలిగినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

బ్లూ స్క్రీన్ ఎర్రర్‌లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్‌ లేదా STOP కోడ్ ఎర్రర్‌ అని కూడా పిలుస్తారు. ఒక క్లిష్టమైన సమస్య Windowsను ఊహించని విధంగా షట్ డౌన్ చేయడానికి… పునఃప్రారంభించవలసి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని సాంకేతిక నిపుణులు వెల్లడించారు.

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు వినియోగించుకునే పలు సంస్థలు, రంగాలపై ప్రభావం పడింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు విఘాతం ఏర్పడింది.  ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలలో ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో లేనట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. తాము కూడా సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఎయిర్‌ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌, స్పైస్‌జెట్ తెలిపాయి.

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులతోపాటు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. ఎయిర్‌లైన్స్, టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు, బ్యాంకులు, మీడియా బ్రాడ్‌కాస్టర్లు ప్రభావితమైనట్లు ఆస్ట్రేలియాలో వార్తా సంస్థలు పేర్కొన్నాయి. న్యూజిలాండ్‌లో కొన్ని బ్యాంకుల ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. పలు దేశాల్లో హాస్పిటల్‌ సేవలతోపాటు స్టాక్‌ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్