Saturday, January 18, 2025
HomeTrending Newsకృష్ణా డెల్టాకు నీరు విడుదల

కృష్ణా డెల్టాకు నీరు విడుదల

Water for Kharif: నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాను ప్రమాదాలు ఉంటున్నాయి కాబట్టి కృష్ణా డెల్టా ఖరీఫ్ సీజన్ కు నీటిని ముందుగానే విడుదల చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఖరీఫ్ ను ముందుగానే  మొదలుపెట్టి తుఫాన్లు రాకముందే మొదటి పంటను ఇంటికి చేర్చుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. రెండవ పంటలు, వీలయితే మూడో పంటను కూడా పండించుకునే వీలుంటుందని చెప్పారు.  నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉందన్నారు.

తూర్పు డెల్టాకు 1500; పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు.  కృష్ణా డెల్టా కింద 13లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.  సిఎం జగన్ ఆదేశాలతో, నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి ఆయకట్టుకు నీరు విడుదల చేశారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొని అంబటి పాల్గొని  శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, మీట నొక్కి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్,  ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్