రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం పర్యాటక రంగంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
బోటు ఆపరేటర్లతో గురువారం సమావేశం నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బోట్ల సామర్ధ్యంపై చర్చిస్తామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాలని అవంతి శ్రినిఅవాస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. శాఖపట్నం రుషికొండలోని