Sunday, September 22, 2024
HomeTrending Newsధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి ఏంటి - మంత్రి ఎర్రబెల్లి

ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి ఏంటి – మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Asked What Was The Attitude Of He Center Towards The Purchase Of Grain : 

రైతే రాజు కావాలని ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ పని చేస్తున్నారని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణాలో పుష్కలంగా నీరు అంది, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంస్థ (ఎఫ్ ఎస్ సి ఎస్) ఆధ్వర్యంలో, పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివ లింగయ్య, డిఎస్ఓ రోజా రమణి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి రాధిక తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఆత్మ గౌరవంతో, ఆత్మహత్యలకు తావు లేని విధంగా సీఎం మొత్తం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రైతుల పంటలను ఆఖరు గింజ వరకు మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. టోకెన్ పద్దతిలో ధాన్యం కొనుగోలును చేపట్టాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన కేంద్రం, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేసిందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. బీజేపీ నేతలకు సవాల్ చేస్తున్న…మీకు దమ్ము ఉంటే, కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించండన్నారు. బండి సంజయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం సిగ్గు చేటని, దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు పై ఒక స్పష్టమైన వైఖరిని తెలపాలన్నారు. రైతులను ఆందోళనకు గురిచేయడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటు అయిపోయిందన్నారు.

Must Read :పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి – ఎర్రబెల్లి

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్