Thursday, March 12, 2026
HomeTrending NewsTANA: మంత్రి ఎర్రబెల్లికి తానా ఘన స్వాగతం

TANA: మంత్రి ఎర్రబెల్లికి తానా ఘన స్వాగతం

అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తానా నాయకులు ఘనస్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, జగదీష్‌ ప్రభల తదితరులు ఆయనకు స్వాగతం పలికి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంతకు ముంది అమెరికా వర్జినియాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి కుటుంబ సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, అభిమానులు, BRS NRI సెల్ శ్రేణులు, తానా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular