Sunday, September 22, 2024
HomeTrending Newsధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష

ధాన్యం సేకరణపై మంత్రి సమీక్ష

Minister Gangula Kamalakars High Level Review On Monsoon Grain Procurement :

రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానాకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ శాఖ పరంగా చేసిన ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు. గన్నీల అందుబాటు, ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు, అకాల వర్షాలనుండి ధాన్యం తడవకుండా టార్పాలిన్ల ఏర్పాటుపై మంత్రి అధికారులకు అధేశాలు జారీచేసారు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా 1033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, పంట కోతలు పూర్తైన ప్రాంతాల్లోనూ అవసరమైన చోట తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామన్నారు మంత్రి గంగుల. ధాన్యంకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయని, రైతుసోదరులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎలాంటి దుష్రచారాలను పట్టించుకోవద్దన్నారు, కొనుగోలు పూర్తైన తర్వాత తరలించడానికి ట్రాన్స్ పోర్టు సదుపాయాలు కూడా పూర్తిగా సిద్దంగా ఉన్నాయని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు మంత్రి గంగుల.

సివిల్ సప్లైస్ శాఖలోని ఐటీ వింగ్ మరింత బలోపేతం చేసి దాని ద్వారా శాఖపరమైన అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకు సంబందించిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Must Read :పోటీ పరీక్షలకు ఉపయోగపడాలి: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్