గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడం, శారీరకంగా ఉల్లాసంగా గడపొచ్చని ఆయన చెప్పారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని దూరజ్పల్లి వద్ద ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంఖుస్థాపన చేశారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ జీవితానికి తొలి మెట్టులా క్రీడలు దోహదపడతయాన్నారు. క్రికెట్ పై యువత కు క్రేజ్ పెరుగుతుందని అందుకు తగిన రీతిలో ప్రోత్సాహం ఉంటుందని ఆయన తెలిపారు. క్రీడాకారులు ఎంచుకున్న క్రీడలోనే తర్ఫీదు ఉండాలని తద్వారా గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మించ తలపెట్టిన స్టేడియంలో150 మంది క్రికెటర్లు ఏక కాలంలో బస చేయడంతో పాటు ప్రాక్టీస్ చేసుకునేలా నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.