Monday, June 15, 2026
HomeTrending NewsGHMC: 16న జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయాలు ప్రారంభం

GHMC: 16న జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయాలు ప్రారంభం

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు జిహెచ్ఎంసి లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కార్పోరేటర్లతో ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ లు నవీన్ రావు ,శంబిపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరుని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని మంత్రి కేతిఆర్ వారికి మార్గదర్శనం చేశారు. 16వ తేదీన జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నదని ఈ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో 16వ తేదీన వార్డు కార్యాలయాల ప్రారంభం చేస్తున్నామని, వీటి ద్వారా నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు

ప్రస్తుతం జిహెచ్ఎంసి ఏర్పాటు చేస్తున్న వార్డు కార్యాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని కేటీఆర్ తెలిపారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై అవగాహన కోసం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఒక విస్తృతస్థాయి సమావేశం కార్పొరేటర్ల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 16వ తేదీన జరిగే వార్డు కార్యాలయ ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, సంఘాలను కలుపుకుపోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

కార్పొరేటర్లు ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకు వెళుతూనే పార్టీ బలోపేతం కోసం కూడా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు. పార్టీ, ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారానే మనం మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం తథ్యం అన్న విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, కార్పొరేటర్ల సారథ్యంలో తమ తమ వార్డుల్లో పార్టీని ఎన్నికలకు సమయత్తం చేయాలన్నారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని తెలిపిన కేటీఆర్, వాటన్నింటిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కార్పొరేటర్లకు మంత్రి కేతిఆర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular