Monday, June 15, 2026
Homeసినిమా'రాజుగారి కోడిపులావ్' నుంచి 'సునో సునామీ' సాంగ్ రిలీజ్

‘రాజుగారి కోడిపులావ్’ నుంచి ‘సునో సునామీ’ సాంగ్ రిలీజ్

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్ లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సునో సునామి’ ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా… ఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది. క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు ‘మల్లిక్ వల్లభ’ చరణాలు అందించగా.. ప్రవీణ్ మని సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ ఆలపించారు.

“ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి. ఇష్టపడినా లేడీ” అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది. రాజు గారి కోడిపులావ్ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన వీడియో మూవీ లవర్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.

రీ యూనియన్ బ్యాచ్ గా కలిసిన కొంత మంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే రాజుగారి పులావ్ సినిమా. ఆద్యంతం సస్పెన్స్ క్రిమ్ థ్రిల్లర్ తో పాటు అందమైన ప్రేమకథతో తెరకెక్కుటున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రేక్షకులకు ఉక్కిరిబిక్కిరి చేసి గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని రాజు గారి పులావ్ సినిమా కలిగిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular