Saturday, June 13, 2026
Homeసినిమాపీపుల్ మీడియా ఫ్యాక్టరీ టార్గెట్ ఇదే

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టార్గెట్ ఇదే

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అనతి కాలంలోనే.. భారీ చిత్రాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకుంది. ఓ వైపు పవర్ స్టార్ తో బ్రో సినిమా నిర్మిస్తూనే.. మరో వైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం నిర్మిస్తుంది. అలాగే ఆదిపురుష్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుండడం విశేషం. పవన్ తో నిర్మిస్తున్న బ్రో సినిమా ఈ సంస్థకు 25వ చిత్రం. సెట్స్ పై ఇంకా పదిహేను సినిమాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం చివరికి 50 సినిమాలు పూర్తి చేయనున్నారు.

నాలుగేళ్లలో వంద సినిమాలు పూర్తి చేయాలి అనేది టార్గెట్. ఇదే కనుక జరిగితే అరుదైన రికార్డ్ ను సొంత చేసుకున్నట్టే. 100 సినిమాలు నిర్మించిన సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. అందులోనూ ఇంత తక్కువ టైమ్ లో 100 సినిమాలు కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే… బహుశా ఎవరూ ఇలా చేయలేరేమో. ఈ నిర్మాణ సంస్థలో కథను ఓకే చేయడం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అలాగే ఈ సంస్థకు మంచి టీమ్ ఉంది. అందుకనే ఇంత తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ పేరుకు తగ్గట్టుగా ఫ్యాక్టరీలా వరుసగా సినిమాలు నిర్మిస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular