Friday, March 29, 2024
HomeTrending Newsపారదర్శకంగా నష్టం అంచనా: కన్నబాబు

పారదర్శకంగా నష్టం అంచనా: కన్నబాబు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు సూచించారు.  ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తల , అధికారులు పర్యటించాలని ఆదేశించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు,.

ఈ సందర్భంగా కన్నబాబు సూచనలు:

⦿ గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది
⦿ ఈ ఆరు జిల్లాల్లో అన్నదాతలకు అండగా ఉండాలి
⦿ ప్రాధమిక అంచనా ప్రకారం 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించాం
⦿ ముంపునీరు పూర్తిగా తగ్గితే కానీ వాస్తవ నష్టాన్ని అంచనా వేయలేము
⦿ ముంపునకు గురైన వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలి
⦿ జలవనరుల శాఖ ఎస్‌ఈలతో చర్చించి కాలువల్లో వర్షపు నీరుపోయేటట్టు చూడాలి
⦿ వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి
⦿ ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించాలి
⦿ నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి
⦿ గులాబ్ ప్రభావం ఎక్కువగా వున్న శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో సీనియర్ వ్యవసాయ శాఖా అధికారులు పర్యటించి ఆయా జిల్లాలు , రాష్ట్ర స్థాయి         అధికారులతో సమన్వయము చేసుకోవాలి.
⦿ వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలి
⦿ ఆర్‌బీకే స్థాయి వరకు వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులకు 24 గంటలూ అందు బాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలి
⦿ ముంపునీరు దిగి పోగానే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్