Sunday, June 14, 2026
HomeTrending Newsమోహన్ బాబుతో పేర్ని నాని భేటీ

మోహన్ బాబుతో పేర్ని నాని భేటీ

Perni-Manchu: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని  హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబును కలుసుకున్నారు. నగరంలో జరిగిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హాజరైన నాని ఆ తర్వాత మోహన్ బాబుతో అయన నివాసంలో భేటీ అయ్యారు. నిన్న సిఎం జగన్ తో సినీప్రముఖుల సమావేశం వివరాలను, చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నాని మోహన్ బాబుకు వివరించారు.

సిఎం జగన్ కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉన్న  మోహన్ బాబు నిన్న జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. అయన వెళ్ళలేదా, లేక ఆయనకు ఆహ్వానం లేదా అనే అంశాలపై నిన్నటి నుంచి జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో   నేటి భేటీ ఆసక్తి కలిగించింది. అందులోనూ మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ సమయంలో చిత్ర పరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వారికి కూడా వివరిస్తే బాగుంటుందని నాని భావించినట్లు తెలిసింది.

ఈ భేటీపై విష్ణు ట్వీట్ చేశారు.  ఓ ఫోటోను కూడా జత చేస్తూ… “నానీ గారూ! మీకు  మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం, టికెట్ రేట్లపై మీరు తీసుకున్న నిర్ణయంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కోసం ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మాకు వెల్లడించినందుకు ధన్యవాదాలు. పరిశ్రమ ప్రయోజనాలు కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు’ అంటూ పేర్కొన్నారు.

Also Read : నెలాఖరులోపు సానుకూల నిర్ణయం: చిరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular