Saturday, June 6, 2026
Homeసినిమా‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

14 Days Love: అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగరాజ్ బోడెమ్ దర్శకత్వంలో హరిబాబు. డి నిర్మిస్తోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ మోషన్ పోస్టర్‌ మరియు ఫస్ట్ లుక్‌ని దర్శకుడు వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.

దర్శకుడు నాగరాజ్ బోడెమ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరికో ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు. మా టీమ్‌ని ఆశీర్వదించి, సినిమా సక్సెస్ కావాలని ఆశీర్వదించిన వినాయక్ గారికి ఈ సందర్భంగా మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఇది ప్యూర్ లవ్ స్టోరి. చిత్రీకరణ అంతా బాగా జరిగింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని తెలిపారు.

నిర్మాత హరిబాబు. డి మాట్లాడుతూ.. దర్శకుడు నాగరాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. మంచి దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ‘14 డేస్ లవ్’ మూవీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ కూడా సిద్ధంగా ఉంది. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్నదే మా బ్యానర్ లక్ష్యం. సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.

Also Read :ధియేటర్ కు రండి – మేము మిమ్మల్ని నవ్విస్తాం – సిద్ధు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular