Irrelevant: 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం ను మున్సిపాలిటీ కాదు కదా కనీసం రెవిన్యూ డివిజన్ కూడా చేయలేని చంద్రబాబునాయుడు కడపకు జగన్ ఏం చేశారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారని, తాను అధికారంలో ఉన్నప్పుడు కుప్పం కు ఏమీ చేయకుండా జగన్ పులివెందులకు, కడపకు ఏం చేశారని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. కడప, కుప్పం, పులివెందుల వెళ్లి చూస్తే జగన్ ఏమి చేశారో అర్ధం అవుతుందన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంనతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.
మేనిఫెస్టోను ఇప్పటికే 95 శాతం అమలు చేశామని, ప్రజలు తమను నిలదీస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గడప గడప కూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంచి స్పందన లభిస్తోందని రోజా చెప్పారు. క్విట్ చంద్రబాబు- సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ప్రజల వద్దకు వెళ్తామని ఈ సారి టిడిపికి 23 సీట్లు కూడా రావని రోజా విమర్శించారు. చంద్రబాబు మతిమరుపుతో బుర్ర పనిచేయకుండా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు రోజా.
Also Read : ఇబ్బందులున్నా సంక్షేమం కొనసాగించాం: రోజా