Sunday, May 19, 2024
HomeTrending Newsరైతుకు జగన్ ఇస్తున్న ఆపన్న హస్తం : రోజా

రైతుకు జగన్ ఇస్తున్న ఆపన్న హస్తం : రోజా

Bharosa:  ఆపదలో ఉన్న రైతుకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న అపన్న హస్తమే వైఎస్సార్  రైతు భరోసా పథకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు.  దివంగత నేత వైఎస్ఆర్  రైతులకు నాడు భరోసాగా ఉన్నారని, తరువాత మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రైతులకు మేలు జరుగుతోందని చెప్పారు.  తిరుపతి జిల్లా చంద్రగిరిలోని  రాయల చెరువు కట్టపైన జరిగిన నాలుగో విడత రైతు భరోసా ప్రారంభోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పక్క రాష్ట్రంవారు  కూడా  మన పరిపాలన పాలన మెచ్చుకుని, ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.

బాదుడే బాదుడు అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు వ్యవసాయం అవసరం లేదని బుక్ రాసిన వ్యక్తి అయన అని రోజా విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు అధికారంలో  ఉన్నప్పుడు దాదాపు 90%  రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారని, కష్టపడి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, కానీ ఈరోజు రైతన్నలకు కావాల్సిన  ఎరువులు, పురుగుల మందుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని రు వివరించారు.  పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే కష్టానికి రైతులను దూరం చేసిన ఘనత సిఎం జగన్ కే దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, వెంకట్ గౌడ్, బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి, చిత్తూరు ఎంపీలు మద్దెల గురుమూర్తి, రెడ్డప్ప, అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీ తిరుపతి జిల్లా ఛైర్మెన్ రఘునాథ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్