Gadapa Gadapaku…: గత పాలకులు అధికారం కోసం హామీలు ఇచ్చి తర్వాత వాటిని తుంగలో తొక్కారని, కానీ సిఎం జగన్ ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా కితాబిచ్చారు. కరోనా మహమ్మారితో ఏర్పడ్డ ఆర్ధిక ఇబ్బందులు, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ మంచి మనసు, దూరదృష్టి మరెవ్వరికీ ఉండబోదని అన్నారు. సిఎం జగన్ పిలుపు మేరకు నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం టీసీ అగ్రహారం పరిధి కల్లూరు పంచాయతీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్నినేడు రోజా ప్రారంభించారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ చేదోడు, అమ్మ వడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, మన బడి నాడు నేడు, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ బీమా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ చేయూత లాంటి ఎన్నోపథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని…. ప్రజలంతా సిఎం జగన్ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా, మండల స్థాయి అధికారులతో కలసి గడప గడప కు వెళ్లి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కుటుంబాల వారీగా పొందిన లబ్ధిని మంత్రి వివరించారు. పథకాల అమలు తీరును ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : విశాఖకు సిఎం జగన్, ఇళ్ళ పట్టాల పంపిణీ