Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్యాపిటల్ : శ్రీనివాస గౌడ్

హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్యాపిటల్ : శ్రీనివాస గౌడ్

Bandminton Tournament: తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ లోని పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అనంత్ బజాజ్ మెమోరియల్-BAI సిరీస్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – 2021ను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ నగరం క్యాపిటల్ గా, బ్యాడ్మింటన్ క్రీడాకారుల తయారీ కేంద్రంగా మారిందన్నారు. గోపిచంద్ అకాడమీ ఎంతో మంది క్రీడాకారులను ఒలింపియన్లుగా, ఛాంపియన్లుగా తయారుచేస్తోందని అభినందించారు.

రాష్ట్రంలో క్రీడా పాలసీని తయారు చేస్తున్నామని, అందులో భాగంగా క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్యలో 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. అనంతరం క్రీడాకారులతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బ్యాడ్మింటన్ ఆడి వారిని ఉత్తేజపరిచారు.

ఈ కార్యక్రమంలో పుల్లెల గోపిచంద్, పూజ బజాజ్, మయంక్ అగర్వాల్, శ్రీకాంత్ కిడాంబి, సాయి ప్రణీత్, చాముండేశ్వరి నాధ్, BAT అధ్యక్షుడు ఒమర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular