Monday, June 8, 2026
HomeTrending Newsవిపక్షానిది బాధ్యాతారాహిత్యం: మంత్రులు

విపక్షానిది బాధ్యాతారాహిత్యం: మంత్రులు

Suspend them: అసెంబ్లీలో టిడిపి సభ్యుల ప్రవర్తనపై మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నని), కురసాల కన్నబాబు తీవ్రంగా తప్పు బట్టారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి, పేపర్లు చించి ఆయనపై విసిరి వేయడం దారుణమన్నారు. టిడిపి సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ను కోరారు.

బడ్జెట్‌ సమావేశాల్లో అయిదవ రోజు, సభ ప్రారంభంతోనే టీడీపీ నినాదాలు చేస్తూ, వాయిదా తీర్మానంపై చర్చకు డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు 18 మంది బలయ్యారని ఆరోపిస్తూ, చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ పోడియం కూడా చుట్టుముట్టడంతో సభను స్పీకర్‌ కాసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే విధంగా వ్యవహరిస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ప్రశ్నోత్తరాలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది.

నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచిన చంద్రబాబు, తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)ఆరోపించారు.  ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇవాళ కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పు పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కధనం రాసిందన్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని కోరారు

శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌గా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎక్కడా, ఏదీ వదలకుండా శవాలు పట్టుకుని రాజకీయం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కించపర్చాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇంటింటికీ బెల్ట్‌ షాప్‌లు, పర్మిట్‌ రూమ్‌లు పెట్టి ఆనాడు దారుణంగా మద్యం అమ్మకాలు కొనసాగించారని… నాడు ఎన్టీఆర్‌ మద్య నిషేధం అమలు చేస్తే, అధికారంలోకి రాగానే మద్యం కంపెనీలతో కుమ్మక్కై మద్య నిషేధానికి తూట్లు పొడిచారని కన్నబాబు విమర్శించారు. ఎల్లో మీడియాలో కధనాల రాస్తున్నారని, వాటిని పట్టుకుని టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular