Monday, June 8, 2026
Homeసినిమా'సామాన్యుడు' ని ఆదరిస్తున్న ప్రేక్షకులు

‘సామాన్యుడు’ ని ఆదరిస్తున్న ప్రేక్షకులు

Samanyudu:  తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో విశాల్ నటించిన ‘సామాన్యుడు’ మార్చి 4 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది. తెలుగులో  విడుదలైన సామాన్యుడుకు ZEE5 వీక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇటీవలే విడుదలైన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘లూజర్’, ‘లూజర్ 2’, సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’, అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. మార్చి 11 నుండి ‘రౌడీ బాయ్స్’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో మోస్ట్ పాపులర్ అయిన విశాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. డింపుల్ హయతి, రవీనా రవి, యోగి బాబు, రమణ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉండడంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది థియేటర్లలో విడుదలైనప్పుడు  ప్రేక్షకుల నుండి మంచి  రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అంత‌కు మించి అనేలా విశేషాద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular