Sunday, February 23, 2025
HomeTrending Newsసిఎంకు అభినందనలు

సిఎంకు అభినందనలు

Skoch Awards: స్కోచ్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్ధానంలో నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలియజేశారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

2021 సంవత్సరానికి గానూ స్కోచ్ గ్రూప్ వెలువరించిన గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ లో ఏపీ ప్రభుత్వం మొదటి ర్యాంకు సాధించింది. జగన్ ప్రభుత్వం ఈ ఘనత సాధించడం వరుసగా ఇది రెండోసారి. 2021 స్కోచ్ ర్యాంకుల్లో  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్తా చాటింది. వ్యవ‌సాయం, గ్రామీణాభివృద్ధి, పోలీసు ర‌క్షణ‌లో ఫ‌స్ట్ ర్యాంకు సాధించింది. జిల్లాల ప‌రిపాల‌న‌లోనూ ఏపీకి మొద‌టి స్థానం; ఈ-గ‌వ‌ర్నెన్స్‌ లో రెండో స్థానం; ట్రాన్స్‌ఫోర్ట్ విభాగంలో మూడో స్థానం లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్